

నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్‌తో గుర్తింపు పొందిన నందన తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. 28 రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చినట్లు ఆమె అక్టోబర్ 4న చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య నందన చేసిన తాజా పోస్ట్‌పై ఆసక్తి నెలకొంది. గత 28 రోజుల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని ఆమె తన పోస్టులో వెల్లడించారు.
ఈ అనుభవం నుంచి తాను చేదు జ్ఞాపకాలతో కాకుండా విలువైన పాఠాలు, ధైర్యం, ఆశతో తిరిగి వచ్చానని నందన పేర్కొన్నారు. జీవితంలో నిజాయితీ, సత్యం, అంతర్గత బలం ఎంతో ముఖ్యమని తెలిపారు. కష్టాలు ఎదురైనప్పుడు కూడా మన విలువలను వదులుకోకూడదని, నిజాయితీగా నిలబడటం ఎప్పటికీ విలువైనదేనని పేర్కొన్నారు. గత 28 రోజుల అనుభవం తనను మరింత బలమైన వ్యక్తిగా మార్చిందని తెలిపారు. దసరా సందర్భంగా కూడా ఆమె ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. చీకటి ఎంత బలంగా కనిపించినా చివరికి సత్యం, మంచితనమే విజయం సాధిస్తాయని తన పోస్టులో పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!