
జనరల్

మంత్రి నారా లోకేశ్ సెప్టెంబర్ 24న రాత్రి అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. సెప్టెంబర్ 25న అహ్మదాబాద్‌లో సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో భాగంగా ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో పెట్టుబడుల ఆకర్షణ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, వివిధ రంగాల్లో వ్యాపార విస్తరణకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కాగా, 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!