

తెలంగాణలో జనగణన–2027 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా జీవో ఎంఎస్ నెం.155ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరించనున్నారు. అంతకుముందుగా జనవరి 10 నుంచి 24వ తేదీ వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
జనగణనలో సేకరించిన వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసేందుకు 2027 మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నారు. జనగణనకు సంబంధించి 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణలో జనగణన–2027 నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!