
సినిమాలు

భారీ వరదల కారణంగా నేపాల్‌లో పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ జలప్రళయంలో ప్రాణనష్టంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించింది. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడం నేపాల్‌కు ప్రస్తుతం ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భారత్, చైనా సహా పలు దేశాలు నేపాల్‌కు సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయి.
అయితే విదేశాల నుంచి నేరుగా సహాయక చర్యలు లేదా ఇతర సహాయాన్ని స్వీకరించేందుకు నేపాల్ ఆసక్తి చూపడం లేదని సమాచారం. తమకు ఆర్థిక సహాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని నేపాల్ కోరినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు పునరావాసం, పునర్నిర్మాణ కార్యక్రమాలను చేపట్టేందుకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!