

డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమానికి నటుడు ప్రభాస్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న అవగాహన యాత్రలో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రభాస్‌ను ఆహ్వానించారు. ఇందుకు ప్రభాస్ సానుకూలంగా స్పందించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
డ్రగ్స్ నిర్మూలన కోసం చేపట్టే ప్రయత్నాల్లో సినీ ప్రముఖుల భాగస్వామ్యం ఎంతో కీలకమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా యువతపై సినీ తారల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వారి భాగస్వామ్యంతో డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు తెలపడం ప్రచారానికి మరింత ప్రాధాన్యం తీసుకురానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!