

ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని జరిగిన భారీ భూ దోపిడీపై విచారణ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులు అక్రమంగా మార్చినట్లు ఇప్పటికే గుర్తించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలువురు పాత్రధారులను గుర్తించి, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లను ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు.
ఓటీపీ, ఆధార్, బయోమెట్రిక్ ధృవీకరణ లేకుండానే భూముల హక్కులు మార్చినట్లు విచారణలో వెలుగుచూసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో యజమానికి తెలియకుండా అసైన్డ్ భూమి ఇతరుల పేర్లపైకి మారిన ఘటన కలకలం రేపింది. ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి అక్రమాలు వెలుగుచూస్తుండగా, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సైబర్ క్రైమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్‌ఐసీ విభాగాలు కలిసి డిజిటల్ లాగిన్‌లు, లావాదేవీల ఆనవాళ్లను పరిశీలిస్తూ అసలు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!