
జనరల్

బిహార్ నుంచి బెంగళూరుకు తన రెండేళ్ల కుమారుడితో రెండు రాత్రుల రైలు ప్రయాణం చేస్తున్న ఓ మహిళకు భారతీయ రైల్వే సిబ్బంది చేసిన సహాయం ఆకట్టుకుంది. సాయంత్రం రైలు ప్యాంట్రీ కార్ సిబ్బందిని సంప్రదించిన ఆమె.. చిన్న డబ్బా, డ్రై ఓట్స్ ప్యాకెట్ ఇచ్చి తన కుమారుడి కోసం రాత్రి భోజనం వండగలరా అని అడిగారు. సిబ్బంది ఓట్స్ తీసుకుని కేవలం ఐదు నిమిషాల్లోనే తాజాగా వండిన భోజనాన్ని అందించినట్లు ఆమె తెలిపారు.
ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ ఆమె పంచుకున్నారు. ఎలాంటి సంకోచం లేకుండా సహాయం చేసిన ప్యాంట్రీ సిబ్బందిని ప్రశంసిస్తూ.. వారు ఎంతో సహకారంగా, ఆత్మీయంగా వ్యవహరించారని పేర్కొన్నారు. చిన్నారితో ప్రయాణించడం కష్టమైనప్పటికీ, ప్రయాణంలో లభించే చిన్నపాటి ఆప్యాయత, సహాయం ఎంతో తేడా తీసుకువస్తుందని ఆమె అన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!