

టాలీవుడ్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ మరోసారి మూగజీవాల సంక్షేమంపై తన గళం వినిపించారు. జంతువుల విషయంలో తనపై వచ్చే ట్రోల్స్, విమర్శలను పట్టించుకోనని చెబుతూనే.. వాటి సంక్షేమం కోసం ప్రజలు అధికారులను ప్రశ్నించాలని సూచించారు. జంతు సంరక్షణ కేంద్రాలు అధ్వానంగా ఉండటానికి కారణమేంటి? ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు ఎందుకు లేవంటూ ప్రశ్నించారు.
వీధి కుక్కలు, పిల్లులకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, టీకాలు ఎందుకు అందడం లేదని రష్మీ ప్రశ్నించారు. ఆవులు, గేదెల యజమానులకు తగిన మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వడం లేదని, వన్యప్రాణులు మానవ నివాసాల్లోకి ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలని కోరారు. భవిష్యత్ తరాలకు పచ్చదనం మిగులుతుందా అని ప్రశ్నిస్తూ, తనను విమర్శించడంపై సమయం వృథా చేయకుండా ఆ శక్తిని సమస్యల పరిష్కారానికి వినియోగించాలని ఆమె పేర్కొన్నారు. రష్మీ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!