
రాజకీయాలు

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్‌లో లోకేశ్‌తో నిర్వహించిన ముఖాముఖి సందర్భంగా ఆయన అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. ముందస్తుగా ప్రశ్నలు కోరని నాయకులను ఇంటర్వ్యూ చేయడం సులభంగా ఉంటుందని రాజ్‌దీప్ వ్యాఖ్యానించారు.
గతంలో చాలా మంది నాయకులు ముందస్తు ప్రశ్నలు లేకుండానే ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారని, ప్రస్తుతం అలాంటి వారు మినహాయింపుగా మారారని రాజ్‌దీప్ పేర్కొన్నారు. లోకేశ్ వ్యవహరించిన తీరును ఇతర నాయకులు కూడా గమనించి నేర్చుకోవాలని ఆయన సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!