

తిరుపతి అలిపిరి నుంచి సేవా సంకల్ప్ బైక్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 25 మంది తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు పాల్గొంటున్న ఈ యాత్ర ఎనిమిది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కొనసాగనుంది.
శ్రీవారి ఆశీస్సులు కోరుకుంటూ అలిపిరి నుంచి యాత్ర ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో మోదీ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే యాత్ర ఉద్దేశమని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సుపరిపాలన ద్వారా ప్రజల ఆదరణ పొందారని ఆయన అన్నారు. మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!