

నిమ్స్‌లో వెలుగుచూసిన అక్రమాల కేసులో ఏసీబీ విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్పత్రిలో వివిధ విభాగాలకు సంబంధించిన టెండర్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. క్యాంటీన్లు, మెడికల్ షాపులు, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ సేవలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. టెండర్ల కేటాయింపుల్లో నిబంధనలను ఉల్లంఘించి కొందరికి అనుకూలంగా వ్యవహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలను సేకరించేందుకు ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
కోవిడ్ సమయంలో నిమ్స్‌లో బెడ్ల కేటాయింపుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఏసీబీ గుర్తించింది. ఒక్కో బెడ్ కేటాయింపునకు రూ.లక్ష వరకు లంచం తీసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ అక్రమాల్లో ప్రశాంత్‌తో కలిసి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెండర్ల అక్రమాలు, బెడ్ల కేటాయింపుల్లో జరిగిన వసూళ్లకు సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!