

శ్రావణ మాసం శివారాధనకు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ మాసంలోని శనివారాలు శివుడితో పాటు శనీశ్వరుడిని పూజించడానికి ప్రత్యేకమైనవిగా చెబుతారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దశలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శ్రావణ శనివారం ప్రత్యేక పూజలు, పరిహారాలు పాటిస్తే శని ప్రభావం నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
శ్రావణ శనివారం సమీపంలోని శివాలయానికి వెళ్లి శివలింగానికి గంగాజలం లేదా కొబ్బరి నీటితో అభిషేకం చేయవచ్చు. అనంతరం నువ్వుల నూనెతో దీపారాధన చేసి, గంధం, విభూతితో అలంకరించి నల్ల నువ్వులు, జమ్మి ఆకులు, నీలిరంగు పూలు, జిల్లేడు పువ్వులు, బెల్లం సమర్పిస్తారు. శివాష్టకం, లింగాష్టకం, శివ సహస్రనామాలు పఠించడం, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించడం కూడా సంప్రదాయంలో శుభప్రదంగా భావిస్తారు.
గమనిక:
పైన పేర్కొన్న వివరాలు జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు సంప్రదాయాల ఆధారంగా అందించిన సమాచారం మాత్రమే. వీటికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. ఈ పరిహారాలను పాటించడం పూర్తిగా వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!