

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ప్రత్యేక గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వచ్చే ఏడాది మేలో జరిగే తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు స్మిత్ మచ్చర్‌ను ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి వేడుకల్లో ప్రత్యేక జ్యోతి వెలిగించాలని ఆయన ఆహ్వానించారు. ఈ గౌరవం సాధారణంగా ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే దక్కుతుందని నెతన్యాహూ పేర్కొన్నారు.
స్మిత్ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన నెతన్యాహూ.. భారత్, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచానికే ఆయన హీరో అని ప్రశంసించారు. ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడి చేసిన సమయంలో గాయపడినప్పటికీ స్మిత్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అబుదాబిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!