

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌కు విమాన ప్రయాణంలో ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. ఇటీవల ఆయన ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా, తోటి ప్రయాణికులు ఆయన్ను గుర్తించి ఆనందం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అందరూ కలిసి ఆయన పాడిన ప్రముఖ పాట ‘కల్ హో నా హో’ను ఆలపిస్తూ సర్‌ప్రైజ్ ఇచ్చారు. విమానం సుమారు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులంతా ఒకేసారి పాట పాడటంతో విమానంలో సందడి నెలకొంది.
ప్రయాణికుల అభిమానానికి సోనూ నిగమ్ సంతోషం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రత్యేక అనుభవానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పంచుకున్నారు. అయితే ఈ ఘటనలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ప్రయాణికులు ఎంచుకున్న పాటే. ‘కల్ హో నా హో’ అనే పాటను విమానంలో ఆలపించడం ఆసక్తికరంగా, కొంత హాస్యభరితంగా అనిపించడంతో ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. అభిమానులు తమ అభిమాన గాయకుడికి ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!