

తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మెడికల్ షాపుల్లో జరిగిన లావాదేవీల డేటాను ఆధారంగా చేసుకుని అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 138 మెడికల్ షాపుల్లో అబార్షన్ కిట్ల విక్రయాలకు సంబంధించి భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్, సరైన బిల్లులు లేకుండానే షెడ్యూల్-హెచ్ మందులను విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఔషధాల విక్రయాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన 138 మెడికల్ షాపులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలను అరికట్టడంతో పాటు, ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మందుల విక్రయాలు జరిగేలా చూడటమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!