

కార్మికుల ఆరోగ్య భద్రతకు కీలకమైన ఈఎస్ఐ ఆస్పత్రుల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. గత 70 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈఎస్ఐ వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కార్మికులకు అందుతున్న వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రస్తుత వ్యవస్థను కొనసాగించాలని కోరింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్వహణపై తమ అభ్యంతరాలను వివరించారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐసీ) ప్రతిపాదిస్తున్న సొసైటీ విధానాన్ని నిలిపివేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రామచంద్రాపురం, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రులను ఈఎస్ఐసీ తన పరిధిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!