13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీలో కీలక నిర్ణయాలు

Writer: Harika S 02:31 PM, 13 అక్టోబర్, 2026
తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీలో కీలక నిర్ణయాలు

తెలంగాణలో రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన కీలక రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్‌వేలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం లభించిందని, NH-167Kపై తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేలా కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనకు కూడా సానుకూలత లభించిందని వెల్లడించారు.

హైదరాబాద్–శ్రీశైలం NH-765పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పర్వతమాల పథకం కింద ఐదు రోప్‌వేలు, సేతు బంధన్ పథకం కింద మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్లు తెలిపారు. హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపైనా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో 34 పనులకు CRIF నిధులు మంజూరు చేయాలని కోమటిరెడ్డి కోరగా, సంబంధిత అధికారులకు గడ్కరీ సూచనలు ఇచ్చారు. పుల్లూరు నుంచి నల్గొండ వరకు పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ కార్యక్రమానికి హాజరవుతానని గడ్కరీ తెలిపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్

తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!

చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా మలయప్ప స్వామి దర్శనం

చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా మలయప్ప స్వామి దర్శనం

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

ట్యాగ్లు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినితిన్ గడ్కరీతెలంగాణ మౌలిక వసతులుతెలంగాణ రహదారి ప్రాజెక్టులుఎలివేటెడ్ కారిడార్కృష్ణా నది కేబుల్ బ్రిడ్జిహైదరాబాద్ అమరావతి హైవేఇండియన్ రోడ్ కాంగ్రెస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!
క్రీడలు

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...
జనరల్

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన
సినిమాలు

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం
క్రీడలు

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం
జనరల్

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ
సినిమాలు

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ

బిగ్‌బాస్ తెలుగు 10 టైటిల్ పోరు ఆ ఇద్దరి మధ్యే.. చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 టైటిల్ పోరు ఆ ఇద్దరి మధ్యే.. చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏఐతో చిన్న వ్యాపారాల్లో కొత్త ఉద్యోగాలు.. నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

ఏఐతో చిన్న వ్యాపారాల్లో కొత్త ఉద్యోగాలు.. నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు

దక్షిణాది దర్శకుడి వేధింపులపై నీతి టేలర్ సంచలన వ్యాఖ్యలు
గాసిప్స్

దక్షిణాది దర్శకుడి వేధింపులపై నీతి టేలర్ సంచలన వ్యాఖ్యలు

సింగరేణి కార్మికులకు బోనస్, ఉద్యోగాలు.. భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు
రాజకీయాలు

సింగరేణి కార్మికులకు బోనస్, ఉద్యోగాలు.. భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు

భారత్‌లోకి ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. త్వరలో లాంచ్
టెక్నాలజీ

భారత్‌లోకి ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. త్వరలో లాంచ్

తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీలో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణకు కీలక రహదారి ప్రాజెక్టులు.. నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీలో కీలక నిర్ణయాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!