

తిరుమలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. సెలవులు, పెరటాసి మాసం కలిసి రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఇటీవల జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయని పేర్కొన్నారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పెరగనున్న రద్దీకి అనుగుణంగా వసతి, ఆహారం, వైద్యం, పారిశుద్ధ్యం, రవాణా తదితర ఏర్పాట్లపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సమర్థవంతంగా అమలు చేసిన ఏర్పాట్లను కొనసాగించడంతో పాటు, గతంలో ఎదురైన చిన్నచిన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు అధికారులకు సూచనలు చేశామన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవలను వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!