

మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే అపరిశుభ్ర షవర్మా స్టాల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవడాన్ని ప్రశంసిస్తూ ఓ వ్యక్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక షవర్మా స్టాల్స్‌లో తరచూ తినే ఆయన.. అధికారుల చర్యల తర్వాత ఫుడ్ కార్టుల పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని తెలిపారు. వ్యాపారులు పరిశుభ్రత, ఆహార నాణ్యతపై గతంలో కంటే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.
గతంలో కొన్ని స్టాల్స్‌లో షవర్మా తిన్న తర్వాత చేతులపై నల్లటి రంగు కనిపించేదని ఆయన గుర్తుచేశారు. అయితే అధికారులు పరిశుభ్రత నిబంధనలపై కఠినంగా వ్యవహరించడం ప్రారంభించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని చెప్పారు. తుకారాం ముండేను “రియల్ లైఫ్ సింగం”గా అభివర్ణిస్తూ, ఆహార భద్రత కోసం కఠిన చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ, ముండే చర్యలను ప్రశంసించారు. అపరిశుభ్ర ఆహార విక్రయాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!