

అస్సాంలోని బొంగాయిగావ్ జిల్లాలో న్యూ బొంగాయిగావ్ రైల్వే స్టేషన్‌లో తొమ్మిది మంది బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొంగాయిగావ్ పోలీసులు, ప్రభుత్వ రైల్వే పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో తొలుత రైల్వే టికెట్ కౌంటర్ సమీపంలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో ముగ్గురిని కూడా పట్టుకున్నారు. ప్రస్తుతం వారి గుర్తింపు, జాతీయత, ప్రయాణ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
వారి వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, నాలుగు బంగ్లాదేశ్ జాతీయ గుర్తింపు కార్డులు, ఒక బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్, మూడు అనుమానిత నకిలీ భారతీయ ఆధార్ కార్డులు, ఐదు రైల్వే టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వారు పొరుగు రాష్ట్రం మీదుగా అస్సాంలోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పని కోసం భారత్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వారు ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. వారు దేశంలోకి ఎలా ప్రవేశించారు, అనుమానిత నకిలీ పత్రాలు ఎలా పొందారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!