

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగం ఒక నిజమైన మార్గదర్శకుడిని, ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. 94 ఏళ్ల వయసులోనూ సినిమాలు రూపొందిస్తూ కళపై తనకున్న అంకితభావాన్ని సింగీతం చాటుకున్నారని గుర్తుచేశారు. మూకీ చిత్రాల నుంచి సైన్స్‌ఫిక్షన్ వరకు వైవిధ్యమైన ప్రయోగాలతో భారతీయ సినిమాకు ఆయన కొత్త దారులు చూపించారని జగన్ కొనియాడారు.
సింగీతం శ్రీనివాసరావు అసమాన సృజనాత్మకత తరతరాల సినీ కళాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘మయూరి’ వంటి వినూత్న చిత్రాలతో సింగీతం ప్రత్యేక గుర్తింపు పొందారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!