

లఖ్నవూలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అమేఠీలో తయారవుతున్న ఏకే–203 రైఫిళ్లు నక్సలైట్లు, ఉగ్రవాదులకు కూడా సవాల్‌గా మారాయని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడాలో ప్రారంభమైన ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్‌లోని పలు ప్రాంతాలకు పెట్టుబడులు వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ఆర్థికంగా ముందుకు సాగుతోందని అమిత్ షా అన్నారు.
దేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ విస్తరిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజకీయ స్థిరత్వం ఉండటంతో విధానాలను నిరంతరాయంగా అమలు చేయగలుగుతున్నామని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని కూడా ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లో జరుగుతున్న ఈ వాణిజ్య ప్రదర్శనలో తయారీదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎగుమతిదారులు, చేతివృత్తుల వారు, అంకుర సంస్థలు, అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!