

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ పన్నెండు రాశుల్లో నాలుగు రాశుల వారికి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీపావళి సమయంలో శుక్రుడు, గురుడు వంటి కీలక గ్రహాల సంచారంలో మార్పులు చోటుచేసుకోనున్నాయని, వాటి ప్రభావంతో ఈ నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి: దీపావళి నుంచి వృషభ రాశి వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బు చేతికి రావచ్చు. ఉద్యోగులకు జీతం పెరగడంతో పాటు కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారులకు పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు.
తుల రాశి: ఈ దీపావళి తుల రాశి వారి జీవితంలో కీలకమైన మార్పులకు నాంది పలకవచ్చని అంచనా. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఆఫర్లు రావచ్చు. వ్యాపారంలో భాగస్వాముల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గి, చేతిలో డబ్బు నిలిచే సూచనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
కన్య రాశి: కన్య రాశి వారికి కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభించవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. అప్పుల బాధ నుంచి ఉపశమనం కలగవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్‌తో పాటు గౌరవం పెరిగే అవకాశం ఉంది. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చని చెబుతున్నారు.
కుంభ రాశి: దీపావళి నుంచి కుంభ రాశి వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చని పండితులు అంచనా వేస్తున్నారు. ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలగవచ్చు. విదేశాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వారికి విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడంతో పాటు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే కల నెరవేరే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!