

నితిన్ హీరోగా రూపొందుతున్న అలియాస్ రుక్మిణి సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.25 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఒక్క నైజాం ప్రాంతం నుంచే రూ.10 కోట్ల మేర హక్కుల విలువ ఉన్నట్లు తెలుస్తోంది. సరైన సినిమా పడితే భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా నితిన్‌కు ఉంది. అయితే ఇటీవల ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో వరుస విజయాలు అందుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో అలియాస్ రుక్మిణిపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను పరిశీలిస్తే నితిన్ కు తగ్గ కథతో సినిమా రూపొందినట్లు కనిపిస్తోంది. కంటెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఆయన కూడా చాలా సహజంగా కనిపిస్తున్నారు. ఈ విజయం నితిన్‌తో పాటు నానికి కూడా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ది పారడైజ్ సినిమాతో పెట్టుబడులు పెట్టిన బయ్యర్లకు ఆశించిన లాభాలు రాకపోవడంతో ఇప్పుడు కొత్త విజయంపై ఆశలు నెలకొన్నాయి. ఈ ఏడాది ముగిసేలోపు మరో మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అలియాస్ రుక్మిణి ఆ అంచనాలను అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!