

రాకింగ్ స్టార్ యష్‌కు 2026లో రెండు విభిన్న ఫలితాలు ఎదురయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘టాక్సిక్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోగా, ‘రామాయణ పార్ట్ 1’లో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ‘రామాయణ పార్ట్ 2’తో బిజీగా ఉన్న యష్, ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్‌ను ఎంచుకుంటారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
యష్ తదుపరి సినిమాకు సంబంధించి సినీ వర్గాల్లో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘సర్దార్’ చిత్రంతో గుర్తింపు పొందిన పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో యష్ ఓ అడ్వెంచర్ మూవీ చేయనున్నాడని గతంలో ప్రచారం జరిగింది. అయితే ‘సర్దార్ 2’ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌పై సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్‌తో యష్ సినిమా చేయనున్నాడనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఊహాగానాలపై యష్ ఎప్పుడు స్పష్టత ఇస్తాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!