

అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దూత’ వెబ్ సిరీస్ మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, ఇప్పుడు రెండో సీజన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ‘దూత 2’ పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం విశేషం. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ద్వారా నాగచైతన్య నిర్మాతగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.
మొదటి సీజన్లో కనిపించిన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ తమ పాత్రలను కొనసాగించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రముఖ నటి భూమిక చావ్లా ఈ సీజన్లో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ‘సవ్యసాచి’ సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య, భూమిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!