
జనరల్

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో ఆయన వివాహం చేసుకోనున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ముంబైలోని బాంద్రా నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుండగా, సుమారు 150 మంది అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఈ వేడుకకు ఆమిర్ ఖాన్ మాజీ భార్యలు, ఆయన పిల్లలు జునైద్, ఐరా, ఆజాద్‌తో పాటు గౌరీ స్ప్రాట్ తొలి వివాహం ద్వారా జన్మించిన కుమారుడు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి. అయితే ఈ వివాహంపై ఆమిర్ ఖాన్ లేదా ఆయన ప్రతినిధుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!