

యువ కథానాయకుడు అడివి శేష్ ప్రస్తుతం తన ప్రతిష్ఠాత్మక స్పై థ్రిల్లర్ ‘గూఢచారి 2’కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. శేష్ తన తదుపరి ప్రాజెక్టును కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ ఇప్పటికే ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా.. ఈ నెలాఖరులో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.
అడివి శేష్, రాహుల్ రవీంద్రన్ కలయికలో సినిమా రానుందనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్టుతో రాహుల్ రవీంద్రన్ సరికొత్త కథాంశం, భిన్నమైన జానర్‌ను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా కథ, జానర్, నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!