

చైతూ జొన్నలగడ్డ తన విభిన్నమైన పాత్రల ఎంపికతో టాలీవుడ్లో నెమ్మదిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఆయన నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు, కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్, మమ్ముట్టి కలిసి నటిస్తున్న ‘OM: ఆపరేషన్ మోల్’, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ రెండు సినిమాలు కూడా ఈ వారమే థియేటర్లలో విడుదల కానున్నాయి. దీంతో ఈ చిత్రాల్లో చైతూ పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా, దర్శకుడు డీఎస్పీ తెరకెక్కించనున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం చైతూ జొన్నలగడ్డను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అవకాశం ఖరారైతే ఆయన కెరీర్‌కు మంచి మలుపు అయ్యే అవకాశం ఉంది. నటుడు సిద్ధు జొన్నలగడ్డకు సోదరుడైన చైతూ, విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా వస్తున్న ఈ అవకాశాలను ఆయన ఎలా సద్వినియోగం చేసుకుంటారు? పెరుగుతున్న గుర్తింపును ఎలా అందిపుచ్చుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!