

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 15 వరకు షూటింగ్ నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఆయనకు ఇంకా సుమారు 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. దీంతో త్వరలోనే ప్రభాస్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు షూటింగ్‌కు బ్రేక్ ఉన్నప్పటికీ ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమాలోని భారీ యాక్షన్ బ్లాక్స్‌కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ VFX సంస్థలు ఈ భారీ యాక్షన్ సన్నివేశాలపై పనిచేస్తున్నట్లు సమాచారం.
పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గ్రాండ్ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మిగిలిన షూటింగ్, భారీ VFX పనులు సమాంతరంగా సాగుతుండటంతో ‘ఫౌజీ’పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!