

తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయిక రితికా నాయక్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘మిరాయ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ బ్యూటీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరో ఎవరో వెల్లడించిన రితికా, నటిగా తన లక్ష్యాల గురించి కూడా మాట్లాడారు. అందం కంటే నటనకే ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నానని, ప్రేక్షకులు తనను అందమైన కథానాయికగానే కాకుండా మంచి నటిగా గుర్తించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందని, ఒకే తరహా పాత్రలకు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.
అదే ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి అడగ్గా, అల్లు అర్జున్ అంటే ఇష్టమని రితికా నాయక్ వెల్లడించారు. తన జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ, తనను ఎంతో ప్రేమించే వ్యక్తి కావాలని, బంధంలో నమ్మకానికి ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన వృత్తిని అర్థం చేసుకుని, కెరీర్‌లో ముందుకు సాగేందుకు ప్రోత్సహించే వ్యక్తి తన భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రితికా ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన ‘డ్యూయెట్’ సినిమాలో నటిస్తున్నారు. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ నటి పుట్టినరోజు సందర్భంగా ఆమె వ్యాఖ్యలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!