

మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా దర్శకుడు వశిష్ఠ రూపొందించిన భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో వేర్వేరు తేదీలు ప్రచారంలోకి రావడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు అయోమయం కూడా కొనసాగుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ‘కాకా’ వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. ముఖ్యంగా శివరాత్రి పండుగను లక్ష్యంగా చేసుకుని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజానికి ఈ ఏడాది నవంబర్‌లోనే సినిమా విడుదలవుతుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు శివరాత్రి సీజన్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న చిత్రానికి పండుగ వాతావరణం బాగా కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు చిరంజీవి అభిమానులను థియేటర్లకు రప్పించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో తాజా ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. త్వరలోనే చిత్రబృందం నుంచి వచ్చే సమాచారం ద్వారా ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!