

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2 చిత్రం గురించి తాజాగా ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 2023లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన జైలర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా అత్యుత్తమ అవుట్‌పుట్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, చిత్రంలోని కొన్ని యాక్షన్ మరియు భావోద్వేగ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెల రోజుల పాటు రీషూట్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటి భాగం తరహాలోనే స్టైలిష్ ప్రెజెంటేషన్, బలమైన ఎమోషన్స్, ఆకట్టుకునే యాక్షన్‌ను అందించేందుకు కీలక సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మార్పుల కారణంగా సెప్టెంబర్‌లో రావాల్సిన సినిమా దీపావళి 2026కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!