
బిజినెస్

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన చివరి చిత్రం జన నాయగన్ సెన్సార్ ప్రక్రియ పూర్తిచేసుకున్నట్లు సమాచారం. జూన్ 30న తొమ్మిది మంది సభ్యులతో కూడిన సీబీఎఫ్‌సీ బృందం చిత్రాన్ని పరిశీలించి, కొన్ని కట్‌లు, మ్యూట్‌లు సూచిస్తూ 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ప్రియమణి పాత్ర పేరును మార్చాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.
సినిమా విడుదల తేదీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. డిస్ట్రిబ్యూటర్లు జూలై 23న, ఓటీటీ సంస్థలు జూలై 16న విడుదల చేయాలని కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు సినిమాలో "దళపతి విజయ్" స్థానంలో "సీఎం విజయ్" టైటిల్ కార్డ్ ఉంటుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!