

రణ్బీర్ కపూర్ ఇప్పటికే ‘రామాయణ’ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాలో మహేశ్ బాబు రాముడిగా కనిపించనుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు కొంత భాగంలో మాత్రమే శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే, కథలో ఈ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. మహేశ్ లుక్, శరీరాకృతి, తెరపై ఆయన కనిపించే తీరు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి మహేశ్ బాబు కోసం శ్రీరాముడి పాత్రను ప్రత్యేకంగా రూపొందించడంతో పాటు, ప్రస్తుత కాలానికి సంబంధించిన కథాంశంతో అనుసంధానించినట్లు తెలుస్తోంది. ఈ వినూత్న ఆలోచన సినిమా ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుందని సమాచారం. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ‘వారణాసి’ చిత్రం 2027లో థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదల సమయంలో మహేశ్ బాబు రాముడి అవతారం, ఆయన నటన ప్రేక్షకుల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!