

‘పుష్ప’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, ఈ సినిమాల కోసం దాదాపు 6 ఏళ్ల సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో ఇకపై తన సినిమాల విషయంలో సమయపాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బన్నీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక సినిమా కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడకుండా, వరుసగా కొత్త చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు తన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారట.
ఈ క్రమంలోనే లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్‌లతో అల్లు అర్జున్ సినిమాలు చేయబోతున్నాడు. ఈ ఇద్దరు దర్శకులు తక్కువ సమయంలోనే సినిమాలను పూర్తి చేయడంలో మంచి గుర్తింపు సంపాదించారు. వీరి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రాలు 2027లో ప్రారంభమయ్యే అవకాశముంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే బన్నీ నుంచి తక్కువ వ్యవధిలోనే వరుస సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ కొత్త ప్రణాళిక ఆయన అభిమానులకు ఎలాంటి సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!