
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష కథానాయికగా, దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'పై మరోసారి చర్చ మొదలైంది. ఈ తరహా పాత్రలో చిరంజీవిని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ రావడంతో విడుదలపై ఉన్న హైప్ కొంత తగ్గింది.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. జూలైలోనే విడుదల తేదీని ప్రకటిస్తారా? లేక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న అధికారిక ప్రకటన చేస్తారా? అన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!