

ఆవు పాలు, గేదె పాలు రెండూ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే వీటిలో కొవ్వు, ప్రోటీన్, కేలరీల పరిమాణంలో తేడాలు ఉంటాయి. సాధారణంగా ఆవు పాలలో గేదె పాలతో పోలిస్తే కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్ బి12, పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి. అందువల్ల బరువు నియంత్రణపై దృష్టి పెట్టేవారు ఆవు పాలను ఎంచుకోవచ్చు. మరోవైపు గేదె పాలలో కొవ్వు, ప్రోటీన్, క్యాల్షియం, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చిక్కగా, క్రీమీగా ఉండటంతో పాటు పెరుగు, పనీర్, నెయ్యి తయారీకి కూడా అనుకూలంగా ఉంటాయి.
జీర్ణక్రియ విషయానికి వస్తే ఆవు పాలు తక్కువ కొవ్వు కలిగి ఉండటం వల్ల కొందరికి తేలికగా జీర్ణమవుతాయి. గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో జీర్ణం కావడానికి కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు. అయితే ఇది వ్యక్తుల జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. పిల్లలకు పాలు ఎంచుకునేటప్పుడు వారి వయసు, పోషక అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఏడాది లోపు చిన్నారులకు ఆవు లేదా గేదె పాలను ప్రధాన పానీయంగా ఇవ్వకూడదు. మొత్తంగా తక్కువ కొవ్వు, కేలరీలు కోరుకునేవారికి ఆవు పాలు, ఎక్కువ కేలరీలు, కొవ్వు అవసరమైనవారికి గేదె పాలు అనుకూలంగా ఉండవచ్చు. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి సరైన పాలను ఎంచుకోవడం ముఖ్యం.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!