
సినిమాలు

ప్రయాణాల్లో మలబద్ధకం సాధారణ సమస్యగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నీరు తక్కువగా తాగడం, ఎక్కువసేపు కూర్చోవడం, ఆహారపు అలవాట్ల మార్పు, నిద్ర సమయాల్లో తేడా వల్ల పేగుల కదలికలు మందగిస్తాయి. మలవిసర్జనను ఆలస్యం చేయడం వల్ల సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
డాక్టర్ల సూచనల ప్రకారం ప్రయాణాల్లో ఎక్కువ నీరు తాగడం, పీచు పదార్థాలు తీసుకోవడం, తేలికపాటి శారీరక కదలికలు చేయడం అవసరం. పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ ఉపయోగకరంగా ఉంటాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ తగ్గించడం మంచిది. సమస్య ఎక్కువైతే వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. సరైన వైద్య సలహా కోసం డాక్టర్‌ను సంప్రదించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!