

ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ప్రమాదకర ఘటనలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ధైర్యంగా పోరాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అరుదైన గౌరవాన్ని అందించింది. ఆయనతోపాటు విమాన సిబ్బందికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారాన్ని ప్రకటించారు. అక్టోబర్ 27న జరిగిన కార్యక్రమంలో దుబాయ్ యువరాజు, ఉప ప్రధాని షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పతకాలను అందజేశారు. ప్రయాణికుల భద్రత కోసం సిబ్బంది చూపిన ధైర్యం, బాధ్యతను యూఏఈ నాయకత్వం ప్రశంసించింది.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో 170 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, కోపైలట్ కాక్‌పిట్‌లోని అత్యవసర గొడ్డలితో కెప్టెన్ స్మిత్‌పై దాడి చేసినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో సిబ్బంది, కొందరు ప్రయాణికులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. అనంతరం విమానంలో ఉన్న మరో పైలట్ల బృందం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్లో సురక్షితంగా దింపింది. ఈ ఘటనలో స్మిత్ చూపిన ధైర్యానికి ఇజ్రాయెల్ కూడా పౌర వీరత్వ పురస్కారాన్ని ప్రకటించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!