

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో భావోద్వేగంగా మాట్లాడారు. అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి తనపై అపారమైన ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి అభిమానికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పలేకపోయినా, వారందరూ తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంటూ అభిమానులకు "థాంక్యూ" చెబుతూ, "కీప్ ది ఫైర్ ఆన్" అంటూ మరింత ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా అభిమానులు, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ గురించి కూడా అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి మనిషికి ఒక రోజులో లభించే సమయం, శక్తిని సానుకూలమైన పనుల కోసం వినియోగించాలని సూచించారు. నచ్చని వ్యక్తులను ద్వేషించడం, ట్రోల్ చేయడం కోసం విలువైన సమయాన్ని వృథా చేయవద్దని, ఆ సమయాన్ని వ్యక్తిగత లక్ష్యాలు, అభివృద్ధి, ఆనందం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, హేటర్స్‌కు పరోక్షంగా ఇచ్చిన సందేశంగా అభిమానులు చర్చించుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!