

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఈ షో 18వ సీజన్ కొనసాగుతోంది. షూటింగ్ సమయంలో తాను జారి పడటంతో మోకాలికి గాయమైందని అమితాబ్ తెలిపారు. సాధారణంగా కేబీసీ ప్రారంభంలో స్టేజ్ మధ్యలో నిల్చొని కంటెస్టెంట్లను ఆహ్వానించే ఆయన.. ఈసారి కూర్చొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోకాలికి గాయం కావడంతో నిలబడటంలో కొంత ఇబ్బంది ఉందని ప్రేక్షకులకు వివరించారు.
అయితే తన గాయం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్ భరోసా ఇచ్చారు. కంటెస్టెంట్లను ఆహ్వానించేందుకు సీటు వద్ద నిలబడగలుగుతున్నానని, అయితే ప్రారంభ ప్రసంగం సమయంలో వారి వద్దకు వెళ్లి నిలబడటంలో కొంత ఇబ్బంది ఎదురవుతోందని చెప్పారు. 83 ఏళ్ల వయసులోనూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అమితాబ్.. ఇటీవల ‘సెక్షన్ 84’లో కనిపించారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సీక్వెల్లో నటిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!