

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రూ.95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతోపాటు రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని, బాధితుడి కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది. కేసు వివరాల ప్రకారం.. 2018లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకి రామయ్య వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే, జానకి రామయ్య మరణించిన అనంతరం ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు ‘పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్’ పేరుతో రూ.95 లక్షలకు సంబంధించిన చెక్ ఇచ్చారు. అయితే, ఆ చెక్ బ్యాంకులో చెల్లుబాటు కాకపోవడంతో వివాదం మొదలైంది.
చెక్ బౌన్స్ కావడంతో జెట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని, బాధితుడికి సంబంధించిన కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేశ్‌కు న్యాయస్థానం నెల రోజుల గడువు కల్పించింది. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!