

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆకాశంలో ఒక తార నవంబర్ 20, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రేపు రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో, బుకింగ్స్‌కు కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. సాధారణ విడుదలకు ముందే ప్రీమియర్ షోల ద్వారా సినిమాను చూసే అవకాశం ప్రేక్షకులకు కలగనుంది.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గెటప్ శ్రీను, కోట జయరామ్, వాసు ఇంటూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైట్‌బాక్స్ మీడియా (సందీప్ గున్నం, రమ్య గున్నం), గీతా ఆర్ట్స్ (అల్లు అరవింద్), స్వప్న సినిమా (స్వప్న దత్), వైజయంతీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాలుగు భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నటీనటులు, అనుభవజ్ఞులైన నిర్మాణ సంస్థలు కలిసి రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!