

హైదరాబాద్‌లో తొలి డాల్బీ సినిమా స్క్రీన్‌తో ప్రారంభమైన అల్లూ సినిమాస్‌లో టికెట్ల బుకింగ్ విధానంపై కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా డాల్బీ సినిమా షోల కోసం సీట్ల కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. థియేటర్‌లో చాలా సీట్లను ముందుగానే బ్లాక్ చేసి, సినిమా ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తున్నారని వారు చెబుతున్నారు. దీంతో ప్రేక్షకులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి థియేటర్‌కు వచ్చే వారు చివరి నిమిషం వరకు సీట్లు అందుబాటులో ఉంటాయో లేదో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ప్రీమియం డాల్బీ సినిమా అనుభూతిని ఆస్వాదించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, ఈ విధానం కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.
ఈ సమస్యను తాజాగా కొంతమంది సినీ ప్రేక్షకులు అల్లూ సినిమాస్ వ్యవస్థాపకుడు, యజమాని అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు టికెట్ల బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్యలను ఆయనకు వివరించి, సీట్లను చివరి నిమిషంలో కాకుండా ముందుగానే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై స్పందించిన అల్లు అరవింద్ సమస్యను పరిశీలిస్తానని, సీట్ల కేటాయింపు వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ప్రేక్షకుల్లో కొంత ఆశాభావం వ్యక్తమవుతోంది. మరి అల్లు అరవింద్ ఇచ్చిన హామీ మేరకు అల్లూ సినిమాస్ టికెట్ల బుకింగ్ విధానంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తారో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!