

లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ కథానాయికగా, ప్రణీత పట్నాయక్, విజ్ఞాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్’. వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించింది. హీరో, హీరోయిన్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ప్రస్తుత సమాజంలో చర్చనీయాంశంగా ఉన్న ఓ అంశం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా వాణిజ్య అంశాలతో కూడిన కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రతి నెలా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే ‘డ్యూ డేట్’ చుట్టూ ఆసక్తికరమైన కథ, కథనాలతో సినిమా సాగుతుందని నిర్మాతలు తెలిపారు. టైటిల్ నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉంటుందని చెప్పారు. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఏకధాటిగా జరిగే తొలి షెడ్యూల్‌తో కీలక చిత్రీకరణ పూర్తిచేయనున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేయడంతో పాటు హృదయాలను హత్తుకునేలా ఉంటుందని నిర్మాతలు పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!