

రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాసిప్’ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి విడుదల చేశారు. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, సామాజిక వ్యంగ్యాన్ని మేళవించిన ఈ చిత్రం గాసిప్ వల్ల వ్యక్తుల జీవితాలపై పడే ప్రభావాన్ని చూపించనుంది. రవివర్మ, మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, విజయ్ అదిరాజు, గురుచరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రబృందం సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రూపొందించామని, సరదాగా చెప్పే ఒక గాసిప్ కూడా ఎవరి జీవితాన్నైనా మార్చగలదనే సందేశాన్ని సినిమా ద్వారా అందిస్తున్నామని తెలిపారు. హీరోయిన్ రాశి సింగ్ ఇది తన తొలి మహిళా ప్రధాన చిత్రం కావడంతో ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ముఖ్య అతిథి సాయి కిరణ్ అడివి చిత్రబృందాన్ని అభినందిస్తూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!