

హనుమంతుడి అంశంతో వస్తున్న సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తున్నాయనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో కూడా హనుమంతుడి అంశం ఉండటం ఆసక్తిని పెంచుతోంది. కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హనుమాన్ అంశ్ సినిమా 400 కోట్ల వసూళ్లు సాధించడం ఇప్పుడు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో భారీగా డబ్బు ఖర్చు చేసిన కొన్ని చిత్రాలు కూడా ఆ స్థాయి వ్యాపారాన్ని అందుకోలేకపోతున్నాయి. దీంతో బడ్జెట్ కంటే కథ, అంశం, ప్రేక్షకుల అనుభూతే విజయానికి ముఖ్యమనే చర్చ సాగుతోంది.
హనుమంతుడి నేపథ్యం ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ప్రత్యేక ఆదరణ కనిపిస్తుండటంతో ఈ తరహా కథలపై అంచనాలు పెరుగుతున్నాయి. రాజమౌళి వారణాసిలో హనుమంతుడి అంశాన్ని ఏ స్థాయిలో చూపించబోతున్నారనే విషయం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.హనుమాన్ అంశ్ సినిమాని హోంబలే సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!