

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయంతో నటుడు సూర్య మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో సూర్యకు తల్లి పాత్రలో నటించిన సీనియర్ నటి రాధిక ఆయనపై ప్రశంసలు కురిపించారు. సూర్య తన జీవితంలో ఎన్నో మానసిక పోరాటాలను ఎదుర్కొన్నారని, వాటిని అధిగమించడాన్ని తాను దగ్గరుండి చూశానని తెలిపారు. సూర్యను తన కుటుంబంలో ఒకరిగా భావిస్తానని, ఆయన కష్టాలను అధిగమించి ఈ స్థాయికి రావడం గర్వంగా ఉందని రాధిక పేర్కొన్నారు.
సూర్య ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదని, తన భావాలను కొద్దిమంది సన్నిహితులతో మాత్రమే పంచుకుంటారని రాధిక చెప్పారు. అలాంటి వారిలో తాను కూడా ఒకరినని, అప్పుడప్పుడు ఆయనకు సలహాలు ఇస్తుంటానని తెలిపారు. గతంలో సూర్య కూడా రాధికతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కార్తి అమెరికాలో చదువుకోవడానికి రాధిక ఆర్థికంగా సహాయం చేశారని, ఆమె చేసిన సాయాన్ని తమ కుటుంబం జీవితాంతం గుర్తుంచుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఐదు రోజుల్లో రూ.150 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!