
జనరల్

నాని నిర్మాణంలో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’ చిత్రంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ‘ధండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా విడుదల తేదీని రేపు ఉదయం 10:08 గంటలకు ప్రకటించనుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన అధికారిక గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఇప్పటివరకు ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని చిత్రబృందం వెల్లడించలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. నాని నిర్మాణం, నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!